: ముగిసిన సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రసంగం


లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించి 1.10కి ముగించారు. అనంతరం సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ 2.15 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రాలను, ప్రజలను ఆకర్షించేందుకు బడ్జెట్ లో ఈసారి ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ఎన్ డీఏ ప్రభుత్వం ప్రకటించలేదు. కేవలం రైల్వేల అభివృద్ధిపైనే దృష్టి సారించి మోడరనైజేషన్ దిశగా రైల్వేను తీసుకువెళ్లాలన్న ఆలోచనను స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రైవేటు పెట్టుబడులు, పీపీపీ పద్ధతిలో, రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటున్నట్టు మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అంతేగాక మేకిన్ ఇండియాను కూడా రైల్వేలో తీసుకురాబోతున్నారు.

  • Loading...

More Telugu News