: రైల్వే స్టేషన్లలో పిల్లల కోసం బేబీఫుడ్, వేడిపాలు, వేడినీళ్లు


రైల్వే స్టేషన్లలో ఇకపై చిన్న పిల్లల కోసం బేబీఫుడ్, వేడిపాలు, వేడినీళ్లు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. టికెట్ రిజర్వేషన్లలో 30 శాతం మహిళలకు సబ్ కోటా ప్రవేశపెట్టనున్నామన్నారు. బుకింగ్ సమయంలోనే ప్రయాణికుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, మహిళల భద్రత కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని తత్కాల్ కౌంటర్లలో సీసీ కెమెరా నిఘా ఉంటుందన్నారు. వడోదరలో రైల్వే యూనివర్సిటీ, చెన్నై కేంద్రంగా మొట్టమొదటి భారతీయ రైల్వే ఆటోహబ్, నాగ్ పూర్ -విజయవాడ ట్రేడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News