: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు


2016-17 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు... * రూ. 1.21 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్. * ఇది నా బడ్జెట్ కాదు. దేశ ప్రజలందరిదీ. * సామాన్యుల ఆశలను తీర్చేలా ప్రతిపాదనలు ఉంటాయి. * రాబడిని పెంచుకునేందుకు కొత్త ఆలోచనలు. * సంప్రదాయాలు వీడి వినూత్నత వైపు అడుగులు వేయాల్సిన సమయం. * వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోబోము. * ఇంధన సేకరణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకున్నాం. * ఇది సవాళ్లతో కూడుకున్న సమయం. * ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. * చార్జీలు పెంచితేనే ఆదాయం వస్తుందన్న ఆలోచన లేదు. * ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాం. * భారీగా ఆదా చేయడమే ఈ ఏటి లక్ష్యం. * భారతీయులంతా గర్వపడేలా రైల్వే వ్యవస్థ. * సేవల నుంచి సౌకర్యాల వరకూ మెరుగుపడాల్సి వుంది. * భద్రతా ప్రమాణాల కోసం అధునాతన సాంకేతికత. * 2008 నుంచి 2014 వరకూ 8 శాతం వృద్ధిలోనే రైల్వేలు. * గత సంవత్సరం ప్రతిపాదనల్లో 139 అంశాల్లో ముందడుగు. * వచ్చే ఐదేళ్లలో రూ. 1.50 లక్షల కోట్లు వెచ్చించేందుకు ఎల్ఐసీ అంగీకారం. * గత ఆరేళ్లలో సగటున రోజుకు 4.3 కి.మీ రైల్వే లైన్ల నిర్మాణం. * ప్రస్తుతం రోజుకు 7 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను నిర్మిస్తున్నాం. * ఒక్క రూపాయి ఖర్చుతో ఐదు రూపాయల వృద్ధి నమోదయ్యేలా పనులు. * 2017-18లో రైల్వేల నుంచి 9 వేల ఉద్యోగాలు రానున్నాయి. * వచ్చే ఏడాది 2 వేల కిలోమీటర్ల మార్గాల విద్యుదీకరణ. * ఢిల్లీ - చెన్నై, ఖరగ్ పూర్ - ముంబై, ఖరగ్ పూర్ - విజయవాడ మధ్య సరకు రవాణా మార్గాలు. * 1,517 కి.మీ మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో కనెక్టివిటీ. * బ్రాడ్ గేజ్ గా మారనున్న మిజోరం - మణిపూర్ లైన్. * మేకిన్ ఇండియాలో భాగంగా రెండు కొత్త లోకో ప్రాజెక్టులు. * అన్ని విభాగాల్లో కాగిత రహిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ దిశగా అడుగులు. * ఈ సంవత్సరం 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు. * వచ్చే రెండు సంవత్సరాల్లో 400 స్టేషన్లకు విస్తరణ. * యువత, ఔత్సాహికులకు సౌలభ్యం కోసమే వైఫై. * 5,300కి.మీ పొడవైన 44 కొత్త లైన్లకు ఎంఓయూలు * అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ బలోపేతంతో లీకేజీలకు అడ్డుకట్ట. * మహిళల కోసం 24/7 పనిచేసే ప్రత్యేక విభాగం. * 311 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు. * రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు. * వ్యయ భారాన్ని పంచుకునే రాష్ట్రాలకు పెద్దపీట. * ప్రయాణికుల నుంచి సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్ఎస్ నంబర్ ఏర్పాటు చేస్తాం. * సాధారణ ప్రయాణికులు, రైల్వేలకు మధ్య అడ్డుగోడలిక ఉండవు. * ఎంపిక చేసిన స్టేషన్లలో డిస్పోజబుల్ బెడ్ షీట్లు. * కొత్తగా 74 రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సేవలు. * 2015-16లో ఇంధన ఆదాతో రూ. 8,720 కోట్ల లాభం. * సామాన్యుల కోసం పూర్తి అన్ రిజర్వుడు బోగీలతో అంత్యోదయా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. * దీన్ దయాళు కోచ్ ల పేరిట అన్ని రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు. * ఈ బోగీలో మంచినీరు, చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు. * ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్ బెర్తుల కేటాయింపు. * పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునికీకరణ. * ప్రాజెక్టు ప్రారంభానికి పట్టే సమయం రెండేళ్ల నుంచి 8 నెలలకు తగ్గించిన ఘనత మోదీ సర్కారుదే. * వచ్చే ఐదేళ్లలో రూ. 8.50 లక్షల కోట్లతో రైల్వేల ఆధునికీకరణ. * పారదర్శకతను పెంచేందుకు సోషల్ మీడియా వినియోగం. * ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం. * బిజీ రూట్లలో ఉదయ్ ఎక్స్ ప్రెస్ పేరిట ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ రైళ్లు. * 2014తో పోల్చితే 20 శాతం తగ్గిన రైలు ప్రమాదాలు. * విద్యుత్ సేకరణలో పోటీ విధానం తరువాత గణనీయమైన ఆదా. * 1,780 ఆటోమేటిక్ టికెట్ విక్రయ కేంద్రాల ఏర్పాటు. * వీటిద్వారా నిమిషానికి 2 వేల నుంచి 7,200 టికెట్ల విక్రయాలు. * పూర్తి స్థాయి రైల్వే విశ్వవిద్యాలయంగా వడోదరలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైల్వే. * ఇకపై ప్రతి ప్రయాణికుడి నుంచి ఫీడ్ బ్యాక్ పొందేలా చర్యలు * ప్రతి రైల్వే ప్రయాణికుడూ బ్రాండ్ అంబాసిడరే. * డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ ఫాం టికెట్లు కొనే అవకాశం. * పాత్రికేయులకు రాయితీ పాస్ ల ద్వారా ఆన్ లైన్ బుకింగ్ నకు అవకాశం.

  • Loading...

More Telugu News