: ఈ వయసులోనూ స్వప్రయోజనాలా?: రతన్ టాటా పై విరుచుకుపడ్డ ఎయిర్ లైన్స్


భారత విమానయాన రంగంలో అమలవుతున్న 5/20 నిబంధనను తొలగించాలని టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని విమానయాన సంస్థలు తప్పుపడుతున్నాయి. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వయసులో ఉన్న ఆయన జాతి ప్రయోజనాలు పక్కనబెట్టి, స్వప్రయోజనాల కోసం ఈ తరహా లేఖలు రాయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ లో భాగంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ లు 5/20 నిబంధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధన ప్రకారం, కనీసం ఐదేళ్లపాటు 20 విమానాలతో సేవలందిస్తేనే, విదేశీ సర్వీసులు నడిపేందుకు అనుమతి లభిస్తుంది.

  • Loading...

More Telugu News