: 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందుగానే భారీ భద్రతతో ప్రత్యేక వాహనంలో రైల్వే బడ్జెట్ ప్రతులను పార్లమెంటుకు తరలించారు. సామాన్యుడి అవసరాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ సిద్ధం చేసినట్టు రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా చెప్పారు.