: టోటల్ టార్గెట్ 30: శిల్పా చక్రపాణిరెడ్డి
వైకాపాలోని 30 మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఎవరికీ మంత్రి పదవులను ఆశగా చూపలేదని వెల్లడించిన ఆయన, వైకాపా పూర్తిగా ఖాళీ అయ్యే రోజు త్వరలోనే రానుందని అన్నారు. చంద్రబాబునాయుడు అభివృద్ధి దిశగా చేస్తున్న కృషి మాత్రమే వారిని ఆకర్షిస్తోందని, నేతల చేరికల వల్ల కార్యకర్తలకు ఎలాంటి నష్టమూ జరగదని అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి మంత్రులు, నేతలు ఉన్నారని నంద్యాలలో కార్యకర్తలతో మాట్లాడిన శిల్పా, వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. కొత్తగా వచ్చిన వారికి ఇప్పటికిప్పుడు ఎలాంటి బాధ్యతలూ ఇవ్వడం లేదని తెలిపారు.