: నేలమ్మను ముద్దాడి, ఎరవాడ జెండాకు సెల్యూట్ చేసి..!
ఈ ఉదయం తన జైలు జీవితానికి స్వస్తి పలికిన సంజయ్ దత్, అభిమానుల నినాదాల మధ్య ఓ పెద్ద బ్యాగును భుజాన తగిలించుకుని, చేతిలో కొన్ని ఫైళ్లతో బయటకు వచ్చాడు. పోలీసు బందోబస్తు మధ్యన జైలు తలుపులు తెరచుకోగా, బయటికొచ్చిన ఆయన, బ్యాగును పక్కనబెట్టి నేలను ముద్దాడాడు. ఆపై జైలు వైపు తిరిగి, పైన ఎగురుతున్న జాతీయ పతాకానికి సెల్యూట్ చేశాడు. నిర్మాత రాజ్ కుమార్ హిరానీ ఆయన్ను విమానాశ్రయానికి తీసుకెళ్లారు. కాగా, వాస్తవానికి ఆయన 10 గంటల సమయంలో విడుదల కావాల్సి వున్నప్పటికీ, సెక్యూరిటీ సమస్యల కారణంగా రెండు గంటల ముందుగానే బయటకు పంపినట్టు తెలుస్తోంది. జైలు బయట అభిమానులతో మాట్లాడుతూ, మీ మద్దతు కారణంగానే బయటపడ్డానని ఒకే ఒక్క మాట చెప్పి వెళ్లిపోయాడు.