: ఇక స్వేచ్ఛాజీవి... జైలు నుంచి విడుదలైన సంజయ్ దత్!
1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్, కొద్దిసేపటి క్రితం పుణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణంగా శిక్షను తగ్గించడంతో 8 నెలల ముందుగానే ఆయన స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు. ఈ కేసులో భాగంగా ఆయన 42 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన సంజయ్ కి ఆయన భార్య మాన్యత, బంధువులు, అభిమానులు స్వాగతం పలికారు. ముంబైకి రోడ్డు మార్గాన వెళితే, మీడియా, అభిమానుల తాకిడి అధికంగా ఉంటుందని భావించిన సంజయ్ కుటుంబం, పుణె నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకుంది. దత్, ఆయన కుటుంబీకులు ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.