: ఇకపై కార్డులు గీకితే సర్ చార్జీలు రద్దు


ఎక్కడైనా షాపింగ్ చేసి, ఆపై క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఇస్తే, దానిపై సర్ చార్జ్ అంటూ, రెండు శాతానికి పైగా బాదుతున్న వైనాన్ని ఎప్పుడైనా అనుభవించారా? ఇకపై అలా కుదరదు. అన్నిరకాల కార్డులు మాధ్యమంగా జరిపే చెల్లింపులపై సేవా ఖర్చులు, కన్వీనియన్స్ ఫీజులు, సర్ చార్జీలను తొలగిస్తూ, మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఫైనాన్స్ లావాదేవీల్లో డబ్బులు చెల్లించే విధానాన్ని తగ్గించేందుకు, కార్డు లావాదేవీలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో నిర్దిష్ట పరిమాణానికి మించిన మొత్తాలను చెల్లించాల్సి వస్తే, కార్డు లేదా ఆన్ లైన్ లావాదేవీని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News