: రాహుల్ పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అటాక్


జేఎన్ యూ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం దాడికి దిగారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జాతి వ్యతిరేక శక్తులను క్షమిస్తారా? అనే విషయాన్ని వారు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జేఎన్ యూ విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ... ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని విభజించే శక్తులకు మద్దతు పలుకుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్ లో అమిత్ షా బుధవారం మాట్లాడారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయా? లేక దేశ ద్రోహమా? అన్న విషయాన్ని పార్లమెంటులో కూర్చున్న అన్ని పార్టీల సభ్యులు స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలు కూడా నిర్ణయించాల్సి ఉందన్నారు. ’దేశ వ్యతిరేక వ్యాఖ్యలను రాహుల్ సమర్థిస్తున్నారా? స్పష్టం చేయాలి. లేకుంటే వాటిని ఖండించాలి’ అని కోరారు. రాహుల్ జీ ఇలాంటి దిగజారుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడవద్దంటూ హితవు పలికారు.

  • Loading...

More Telugu News