: డిక్టేటర్ లా నా స్టయిల్ లో నేనుంటా...!: బాలకృష్ణ


టీడీపీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల చేరికలపై సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తన బావ, సీఎం చంద్రబాబును కలసి లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానించిన సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు బాలయ్య బదులిచ్చారు. ప్రజాభిప్రాయం ప్రకారమే ఇతర పార్టీల వారు టీడీపీలో చేరుతున్నారని విశ్లేషించారు. టీడీపీకి క్రమశిక్షణ, పద్ధతి ఉన్నాయని పేర్కొన్నారు. జగన్ కు తొత్తులుగా పనిచేయలేకే వైకాపా ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నట్టు చెప్పారు. పనిలో పనిగా లేపాక్షి ఉత్సవాల విషయంలోనూ బాలయ్య తనదైన శైలిలో మాట్లాడారు. లేపాక్షి ఉత్సవాలకు సహ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని పిలవలేదని స్పష్టం చేశారు. ఎవర్ని పిలవాలో తనకు తెలుసన్నారు. గ్లామర్ ఉన్న నాయకులు తన చుట్టూ చాలా మందే ఉన్నారని, ఎవర్నీ తలకెక్కించుకోనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘డిక్టేటర్ లా నా స్టయిల్ లో నేనుంటా’ అంటూ ముగించారు.

  • Loading...

More Telugu News