: అఫ్జల్, యాకుబ్ మెమెన్ లను సమర్థించిన వారూ దేశ ద్రోహులే!: వెంకయ్యనాయుడు


వర్సిటీల్లో కొందరు మావోయిస్టుల భావజాలంతో ఉన్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి వారే ఇతర విద్యార్థులను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై లోక్ సభలో జరిగిన చర్చ సందర్బంగా ప్రతిపక్షాల ఆరోపణలకు వెంకయ్య బదులిచ్చారు. అఫ్జల్ గురు, యాకుబ్ మెమెన్ లను సమర్థించిన వారు కూడా దేశ ద్రోహులేనన్నారు. ఇలాంటి అంశాన్ని పార్లమెంటు అంతా ఒక్కటై ఖండించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదన్నారు. దేశ సమగ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతిపక్షాలకు ఆయన గుర్తు చేశారు. సామాజిక మాద్యమాల్లో జెఎన్ యూ విద్యార్థి కన్నయ్య ఉగ్రవాదులకు అనుకూల పోస్టులు చేసి దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News