: 15 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అయ్యే ఒప్పో స్మార్ట్ ఫోన్
మామూలుగా స్మార్ట్ ఫోన్లలో తొందరగా చార్జింగ్ అయిపోతుంటుంది. దాంతో చాలామంది పవర్ బ్యాంక్ ను దగ్గర పెట్టుకుంటారు. ఇక ఆ ఆవసరం లేకుండా బ్యాటరీ డౌన్ అయిపోయిన వెంటనే 15 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే మొబైల్ ను చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ 'ఒప్పో' విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా అత్యంత త్వరగా చార్జ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఇదేనని ఒప్పో తెలిపింది. 'ఒప్పో న్యూ సూపర్ వీఒఒసీ' పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. దాని బ్యాటరీ సామర్థ్యం 2500mAh.