: చిన్న కొడుకుకి ఉద్యోగం అడిగిన రోహిత్ తల్లి...హామీ ఇచ్చిన కేజ్రీవాల్!


ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు రాజా ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిశారు. తన చిన్న కుమారుడు రాజాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తల్లి రాధిక ఈ సందర్భంగా కేజ్రీని కోరారు. దీనికి స్పందించిన కేజ్రీ తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య తరువాత దేశవ్యాప్తంగా రేగిన ఆందోళన సమయంలో కేజ్రీ మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేగాక ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఆయన విమర్శలు కూడా చేశారు.

  • Loading...

More Telugu News