: లేపాక్షి ఉత్సవాలకు చంద్రబాబును ఆహ్వానించిన బాలకృష్ణ


అనంతపురం జిల్లాలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఉత్సవాలకు హాజరవుతానని ఈ సందర్భంగా చంద్రబాబు బాలయ్యకు చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 27, 28న లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే ఉత్సవాలకు కేంద్ర మంత్రులను, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తదితరులను బాలయ్య స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News