: వావ్... విరాట్, అనుష్కలు తిరిగి కలిసే అవకాశం!


సెలబ్రిటీ జంటగా దాదాపు మూడేళ్ల పాటు వార్తల్లో నిలిచి, ఆపై ఇటీవల విడిపోయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జంట తిరిగి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా అనుష్క శర్మ సోదరుడు వీరి మధ్య నెలకొన్న విభేదాలను తొలగించే నిమిత్తం నడుం బిగించాడని, అతనితో కోహ్లీ నిత్యమూ సంప్రదింపులు జరుపుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ జంట తిరిగి కలుస్తుందన్న ఆశ నెలకొంది. కాగా, సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్' చిత్రంలో అవకాశం వచ్చిన సమయంలోనే, కోహ్లీ పెళ్లి ప్రస్తావన తేగా, అందుకు అనుష్క నిరాకరించడంతో వీరి మధ్య బంధం తెగిపోయిందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News