: రోహిత్ దళితుడు కాకుంటే మంత్రులు చేసిన తప్పు ఒప్పవుతుందా?: లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా తప్పుబట్టారు. రోహిత్ దళితుడు కాదన్న అంశాన్నే ఎక్కువగా ప్రచారం చేశారని, అతను దళితుడు కాకుంటే మంత్రులు చేసిన తప్పు ఒప్పవుతుందా? అని లోక్ సభలో ఆయన ప్రశ్నించారు. రోహిత్ ను హెచ్ సీయూ కళాశాల, వసతి గృహం నుంచి దూరంగా ఉంచారని, అతనో టెంట్ లో ఉండాల్సిన పరిస్థితి కల్పించారని అన్నారు. హెచ్ సీయూలో ఆరేళ్లలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన సింధియా, దేశంలో ప్రస్తుత అసహనానికి మనమే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. కాబట్టి రోహిత్ మృతి ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే, సింధియా మాట్లాడుతుండగా సభలో బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు.

  • Loading...

More Telugu News