: తన ఇష్ట దైవం గురించి చెప్పిన హీరో నాగార్జున... మీరూ చూడండి!
టాలీవుడ్ హీరో నాగార్జున తన ఇష్ట దైవం గురించి మనసులో మాటను వెల్లడించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో నూతన దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు తన ఇష్ట దైవమని చెప్పారు. ఒకే ప్రాంతంలో 20 మంది దేవుళ్ల గుడులు ఉండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వఘ్నంగా నిర్వహిస్తున్న ఫిల్మ్ నగర్ సాంస్కృతిక మండలికి అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఆ వీడియోను మీరూ చూడండి.