: పార్లమెంటు వద్ద జగన్ తో ఫొటోలకు పోజిచ్చిన జేసీ


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరన్న మాట అక్షరాల సత్యం. అందుకే మీడియా సాక్షిగా అప్పటివరకు ఒకరినొకరు తిట్టుకునే నేతలు ఎదురుపడగానే ఒక్కసారిగా నవ్వుతూ పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇవాళ పార్లమెంటు వద్ద వైసీపీ అధినేత జగన్, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య సరిగ్గా అలాగే జరిగింది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవడానికి పార్లమెంటుకి వచ్చిన జగన్, పార్లమెంటు సమావేశాలలో పాల్గొనడానికి వచ్చిన దివాకర్ రెడ్డి పార్లమెంటు వద్ద అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. అదే సమయంలో జేసీ సరదాగా జగన్ తో ఫొటోలకు పోజులిచ్చారు. అక్కడే ఉన్న మీడియా సిబ్బందితో 'జేసీ దివాకర్ రెడ్డి వైసీపీలో చేరారని వార్తలిస్తారా ఏంటి?' అంటూ దివాకర్ రెడ్డి నవ్వుతూ జోక్ కూడా చేశారు. అన్నట్టు ఇవాళ జేసీ పుట్టినరోజు కూడా!

  • Loading...

More Telugu News