: తిరుపతి అటవీ శాఖాధికారుల హత్య కేసును కొట్టివేసిన కోర్టు


తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో హత్యకు గురైన ఇద్దరు అటవీ శాఖాధికారుల హత్య కేసును తిరుపతి మూడో అదనపు జిల్లా న్యాయస్థానం కొట్టివేసింది. 2013 డిసెంబర్ 15న ఎర్రచందనం కూలీల దాడిలో అటవీశాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ కరుణాకర్ చనిపోయారు. దానిపై అప్పట్లో రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టులో మూడేళ్ల పాటు విచారణ జరిగింది. అయితే ప్రాసిక్యూషన్ కు సంబంధించి పోలీసులు సరైన సాక్ష్యాలు చూపలేనందున కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి పి.వి.రాంబాబు ఈ రోజు తీర్పు వెలువరించారు. అంతేగాక ఈ కేసులో అరెస్టైన తమిళనాడు నిందితులు 287 మందిని విడుదల చేయాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

  • Loading...

More Telugu News