: జస్టిస్ మంజునాథ కమిషన్ సభ్యులుగా ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్ల నియామకం
జస్టిస్ మంజునాథ కమిషన్ లో కొత్తగా ముగ్గురు సభ్యులను ఏపీ ప్రభుత్వం నియమించింది. కాపులను బీసీల్లో చేర్చే విషయమై అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ మంజునాథ నేతృత్వంలో ఓ కమిషన్ ను వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ లో ముగ్గురిని సభ్యులుగా నియమిస్తూ ఏపీ సర్కారు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ప్రొఫెసర్లు శ్రీమంతుల సత్యనారాయణ, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావులను ప్రభుత్వం కమిషన్ సభ్యులుగా నియమించింది.