: జగన్ మినహా వైసీపీ మొత్తం ఖాళీ చేస్తాం: మంత్రి ఉమ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రారంభమైన ఆకర్ష్ వల ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, త్వరలో మరింతమంది చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఈ చేరికలు కేవలం ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే జగన్ మినహా వైసీపీ మొత్తాన్ని ఖాళీ చేస్తామని దేవినేని ఉమ అన్నారు.