: పెద్దపల్లి ఎంపీ సోదరి వివాహానికి హాజరైన కేసీఆర్ దంపతులు


టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహం ఈ రోజు కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలోని వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ పెళ్లికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందించి ఆశీర్వదించారు. వారితో పాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా వివాహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. అంతకుముందే ఫంక్షన్ హాలు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News