: జకోవిచ్ బెల్లీ డ్యాన్స్ చేసిన వేళ!


నొవాక్ జకోవిచ్... సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. ప్రపంచంలో నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు. దుబాయ్ లో జరుగుతున్న 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ చాంపియన్ షిప్' పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈ 11 టైమ్ గ్రాండ్ స్లామ్ చాంపియన్ ఓ ప్రొఫెషనల్ బెల్లీ డ్యాన్సర్ తో కలసి స్టెప్పులేసి అందరినీ అలరించాడు. సైబీరియాకు చెందిన ఓ డ్యాన్సర్ జకోవిచ్ కి బెల్లీ స్టెప్పులను అక్కడికక్కడే నేర్పిస్తూ వేయించింది. ఇక జకోవిచ్ సైతం తనలోని నృత్య కళాకారుడిని బయటకు తీసి అందరికీ చూపించాడు. డ్యాన్సర్ వేసిన స్టెప్పులను అనుకరించి చుట్టూ ఉన్నవారిని మెస్మరైజ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్.

  • Loading...

More Telugu News