: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయ తొలి స్మార్ట్ స్కూటర్


స్మార్ట్ ఫోన్, స్టార్ట్ వాచ్, స్మార్ట్ స్పెట్స్... వాటి వరుసలో కొత్తగా స్మార్ట్ స్కూటర్ రాబోతోంది. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి స్మార్ట్ స్కూటర్ కావడం మరో విశేషం. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ లు కలసి 2013లో 'ఏథర్ ఎనర్జీ' అనే స్టార్టప్ కంపెనీని బెంగళూరులో ప్రారంభించారు. ఇప్పుడా కంపెనీ నుంచే లిథియం ఆయాన్ బ్యాటరీ బ్యాకప్ తో 'ఏథర్ ఎస్-340' అనే స్మార్ట్ స్కూటర్ ను రూపొందించారు. ఈ ఏడాదిలో జరగనున్న టెక్ సమ్మిట్ లో దాన్ని ఆవిష్కరించనున్నట్టు ఏథర్ ప్రకటించింది. దాంతో దేశంలో తొలి స్మార్ట్ స్కూటర్ తయారుచేయాలన్న తమ కల నెరవేరిందని కంపెనీ తెలిపింది. టచ్ స్క్రీన్ డాష్ బోర్డు, రిమోట్ అప్లికేషన్ కంట్రోల్, లైట్ సెన్సింగ్ హెడ్ ల్యాంప్స్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు. దాంతో పాటు మన దేశంలో కార్లలో అందుబాటులో లేని ఎయిర్ అప్ డేట్స్ అందించడం ఈ స్కూటర్ ప్రధాన ప్రత్యేకతగా చెప్పాలి. బ్యాటరీ బ్యాకప్ తో నడిచే ఈ స్కూటర్ కు ఒకసారి ఛార్జి చేసుకుంటే 72 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లవచ్చు. స్కూటర్ కు జీపీఎస్ సదుపాయం కూడా ఉండటంవల్ల ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఆ మ్యాప్ కూడా డాష్ బోర్డు మీద చూసుకోవచ్చట. వెళ్లే వేగాన్ని బట్టి గమ్యానికి ఎంత సేపట్లో చేరుకోగలమో చెబుతుంది. ఆన్ లైన్ లో మాత్రమే బుక్ చేసుకునే ఈ స్మార్ట్ స్కూటర్ ధర ఇంకా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News