: 16 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కిన బాలయ్య!


సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సైకిల్ తొక్కి తన పార్టీ గుర్తు సత్తా చాటారు. అనంతపురం జిల్లాలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ ఈ రోజు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఆ ర్యాలీని బాలయ్య జెండా ఊపి ప్రారంభించారు. చిలమత్తూరు మండలం కొరికొండ చెక్ పోస్టు నుంచి లేపాక్షి నంది విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సమయంలో లేపాక్షి యువతతో కలసి బాలయ్య కూడా ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. 16 కిలో మీటర్లు సైకిల్ తొక్కి 40 నిమిషాల్లో లేపాక్షి చేరుకున్నారు. దాంతో అక్కడివారంతా ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News