: 'బీజేపీ పని అదేనట'... సోషల్ మీడియాలో నేటి హాట్ టాపిక్!


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని, విచ్చలవిడితనం పెరిగిపోయిందని, మన ఆడపడుచులను పాడు చేస్తున్నారని రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగుతోంది. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్. వర్శిటీలో నగ్న నృత్యాలు జరుగుతాయని, 3 వేల కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తాయని ఆయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, అహూజా వ్యాఖ్యలపై నెటిజన్ల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మచ్చుకు కొన్ని... - వాడేసిన కండోమ్ లను బీజేపీ లెక్కిస్తోందా... యాక్! - కండోమ్ లను కూడా బీజేపీ జాతికి వ్యతిరేకంగా భావిస్తోంది. వాటిని ఎవరైనా వాడినట్టు తెలిస్తే, దేశద్రోహం కేసు పెడతారేమో? - వర్శిటీలో కనిపిస్తున్న వాటిపై విద్యార్థులు పీహెచ్డీ చేస్తున్నారేమో? ఎవరికీ కల్పించుకునే హక్కు లేదు. ఈ దేశానికి ఏ గతి పట్టింది? - విచారణ సాగతీతకు బీజేపీకి ఓ మంచి పాయింట్ కనిపించింది. - అసలు 3 వేల కండోమ్ లను బీజేపీ వారు లెక్కించారంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. - జోకులు పక్కన పెట్టండి. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా ఉన్న దేశంలో కండోమ్ ల వాడకాన్ని ఆపాలని ప్రభుత్వం భావిస్తోందా? - ఆసలు వాడేసిన వాటితో ఏం చేద్దామని బీజేపీ లెక్కలు కడుతోందో? - బీజేపీ లెక్కలు తప్పు... రోజుకు 2 వేల కన్నా ఎక్కువ బీర్లనే జేఎన్యూ విద్యార్థులు వాడుతారనుకుంటా! - ఇండియాలో ప్లాస్టిక్ నియంత్రణకు నడుంబిగించి 'కండోమ్ కలెక్టర్'గా నిలిచిన బీజేపీకి కృతజ్ఞతలు - స్వచ్ఛ భారత్ ను చాలా సీరియస్ గా తీసుకున్న బీజేపీ జేఎన్యూ బయట కూడా ఇవే లెక్కలు వేయాలని ఆశిస్తున్నా. ఇలా సాగుతోంది నెటిజన్ల ట్వీట్ విమర్శల వర్షం.

  • Loading...

More Telugu News