: మరో సీక్రెట్ మీట్... ప్యారిస్ లో పాక్ భద్రతా సలహాదారుతో అజిత్ దోవల్ భేటీ?


భారత్, పాకిస్థాన్ ల మధ్య చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన వ్యూహం అమలులో భాగంగా గత డిసెంబర్ 6న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకాక్ వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు నాసిర్ ఖాన్ జంజువాతో భేటీ అయ్యారు. భేటీ ముగిసి, వారిద్దరూ మీడియా ముందుకు వచ్చేదాకా విషయం ఏ ఒక్కరికి తెలియలేదు. సంయుక్త పత్రికా ప్రకటనను విడుదల చేసిన దోవల్, జంజువాలు.. చర్చల్లో పురోగతి నమోదైందని ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 2న పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడితో మళ్లీ ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో గత నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో అజిత్ దోవల్ మరో సీక్రెట్ భేటీ నిర్వహించారట. అది కూడా పఠాన్ కోట్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత. ఈ సమావేశంలోనూ ఆయన జంజువాతోనే భేటీ అయినట్లు నేటి తన సంచికలో ‘హిందూస్థాన్ టైమ్స్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. పఠాన్ కోట్ దాడికి సంబంధించిన అంశాలపైనే వారిద్దరూ ఆ భేటీలో చర్చించినట్లు ఆ పత్రిక రాసింది.

  • Loading...

More Telugu News