: రెండో రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
రెండో రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అంతకుముందు సభ ప్రారంభమైన వెంటనే... జేఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి వెంకయ్యనాయుడు, అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందు ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం సభలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతున్నారు. మరోవైపు రాజ్యసభ కూడా కొనసాగుతోంది.