: నిజం ఒప్పుకున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్!
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఉరితీయబడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేసిన మాట వాస్తవమేనని విద్యార్థి ఉమర్ ఖలీద్ అంగీకరించినట్టు తెలిసింది. గత రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను దక్షిణ ఢిల్లీలోని కార్యాలయంలో ఉంచిన పోలీసులు ఆపై వారిని ఐదు గంటల పాటు విచారించారు. విచారణలో భాగంగా తాను నినాదాలు చేసినట్టు ఖలీద్ ఒప్పుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, వీరిద్దరిపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అరెస్టయిన వీరిద్దరినీ నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనుండగా, మిగతా విద్యార్థులు రామనాగ, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాష్ లు నేడు సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.