: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల


వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. వరంగల్ లో 45 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదల చేయగా, ఇటు ఖమ్మం కార్పొరేషన్ కు కూడా టీఆర్ఎస్ 28 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. వరంగల్ లోక్ సభ, జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ శాసనసభ ఎన్నికల్లో వరుస విజయాలతో ఉన్న టీఆర్ఎస్ ఈ రెండు కార్పొరేషన్లను కూడా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

  • Loading...

More Telugu News