: ఇండియాపై డొనాల్డ్ ట్రంప్ అక్కసు!


తదుపరి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నిక కావాలన్న ఏకైక కోరికతో, ప్రజల మనసులకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. ఇండియా, చైనా, జపాన్ సహా ఎన్నో దేశాలు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను ఆక్రమిస్తున్నాయని ఆయన ఆరోపించారు. లాస్ వెగాస్ లో జరిగిన ఓ సభలో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, "ప్రతి దేశమూ అమెరికా నుంచి ఎంతో కొంత లాభం పొందాలని చూస్తోంది. ప్రభుత్వ విధానాల్లో లోపాల కారణంగా అమెరికన్లకు నష్టం కలుగుతోంది. ఇది మారాలి" అన్నారు. ఈ దేశాలన్నీ తీసుకెళ్లిపోయిన అమెరికన్ల ఉద్యోగాలను తిరిగి తీసుకురావడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. గత సంవత్సరం జూన్ లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో దిగి, అప్పటి నుంచి అలుపెరగకుండా ప్రచారంలో దూసుకెళ్తున్న ట్రంప్, పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News