: ఫిల్మ్ నగర్ సన్నిధానంలో కొత్త ఆలయాలు... శంకుస్థాపనకు క్యూ కట్టిన సినీ, రాజకీయ ప్రముఖులు


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో కొత్త ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ప్రారంభమైన అంకురార్పణ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూ కట్టారు. చేతికి కట్టుతోనే కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ లతో పాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, సినీ హీరోలు వెంకటేశ్, నాగార్జున తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News