: ఇక ‘ఆసియా కప్’ సందడి!... నేడు భారత్-బంగ్లా మ్యాచ్ తో ప్రారంభం కానున్న సిరీస్
ప్రపంచ క్రికెట్ లో మరో ఆసక్తికర సిరీస్ కు నేటి నుంచి తెర లేవనుంది. బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆతిథ్య దేశం బంగ్లాదేశ్, సిరీస్ హాట్ ఫేవరెట్ గా పరిగణిస్తున్న టీమిండియా మధ్య మ్యాచ్ తో ఈ సిరీస్ నేడు ప్రారంభం కానుంది. మిర్పూర్ లోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో నేటి రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదే స్టేడియంలోనే ఈ సిరీస్ మ్యాచ్ లన్నీ జరగనున్నాయి. ఈ సిరీస్ లో భారత్, బంగ్లాదేశ్ లతో పాటు పాకిస్థాన్, శ్రీలంక జట్లు కూడా పాలుపంచుకుంటున్నాయి. వీటితో పాటు పసికూనల్లో క్వాలిఫై అయిన ఓ జట్టు కూడా ఈ సిరీస్ లో ఆడనుంది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ సిరీస్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక ఈ సిరీస్ లో దాయాదీ దేశాలైన భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఈ నెల ఈ నెల 27న జరగనుంది.