: త్రివేణి సంగమం వద్దే మూత్రవిసర్జన.. కెమేరాకు చిక్కిన అధికారి!


అలహాబాద్ లో త్రివేణి మహోత్సవ్ ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు వచ్చిన ఒక సీనియర్ అధికారి త్రివేణి సంగమం వద్దే మూత్ర విసర్జన చేశారు. అలహాబాద్ ఏడీఎం ఓపీ శ్రీవాత్సవ ఈ పని చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. త్రివేణి మహోత్సవ్ కు సంబంధించి నిర్వహిస్తున్న విలేకరుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. క్లీన్ గంగా అంటూ ప్రభుత్వం ప్రకటనలతో హోరెత్తిస్తుంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక అధికారి ఇటువంటి పని చేయడంపై పలువురు మండిపడుతున్నారు. కాగా, అధికారి మూత్ర విసర్జన చేస్తుండగా తీసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో నెటిజన్ల నుంచి మరిన్ని విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

  • Loading...

More Telugu News