: దర్యాప్తులో భాగంగా ఎఫ్బీఐకి సహకరించాలి!: 'ఐఫోన్' వివాదంపై బిల్ గేట్స్
అమెరికా భద్రతా సంస్థ ఎఫ్బీఐకి ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మద్దతుగా నిలిచారు. శాన్ బెర్నార్డినోలో కాల్పులు జరిపిన ఐఎస్ఐఎస్ తీవ్రవాది ఐఫోన్ ను అన్ లాక్ చేయాలని ఎఫ్బీఐ ఆ సంస్థను కోరగా దానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై బిల్ గేట్స్ స్పందించారు. ఇలాంటి అసాధారణ సమయాల్లో దర్యాప్తు సంస్థలకు సాంకేతక సంస్థలు సహకరించాలని ఆయన సూచించారు. చట్టం అమలుకు సాంకేతిక సంస్థలు సహకరించాలని అన్నారు. ఇది సాధారణంగా జరిగే దర్యాప్తు కాదన్న విషయం గుర్తించాలని బిల్ గేట్స్ తెలిపారు. 'పలు కేసుల దర్యాప్తులో భాగంగా వ్యక్తిగత వివరాలు కావాలంటూ బ్యాంకులు, టెలికాం సంస్థలను అడుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే కదా?' అని ఆయన అభిప్రాయపడ్డారు.