: కాక్ పిట్ లో వాసన...విమానం అత్యవసర ల్యాండింగ్
విమానం కాక్ పిట్ లో అసాధారణమైన వాసన రావడంతో దానిని అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన వర్జిన్ ఎయిర్ లైన్స్ విమానం 160 మంది ప్రయాణికులతో హమిల్టన్ నుంచి సిడ్నీ బయల్దేరింది. మార్గ మధ్యంలో విమానంలోని కాక్ పిట్ లో అసాధారణ వాసన రావడం పైలట్ గుర్తించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా బ్రిస్బేన్ విమానాశ్రయంలో దించాడు. ప్రయాణికులను వేరే విమానంలో గమ్యం చేర్చారు. ఈ విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ అసాధారణ వాసనకు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.