: ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ లో చేరా: బస్వరాజు సారయ్య


తన జిల్లా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తల సూచన మేరకు తాను టీఆర్ఎస్ లో చేరానని బస్వరాజు సారయ్య చెప్పారు. పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ నుంచి తానెలాంటి హామీ తీసుకోలేదని, పార్టీలో తన పాత్రేంటో ఆయనే నిర్ణయిస్తారని ఓ తెలుగు ఛానల్ తో అన్నారు. వరంగల్ అభివృద్ధికి రూ.300 కోట్లు ప్రకటించిన సీఎంకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. వరంగల్ జిల్లాలోని పలు పార్టీల నేతలంతా టీఆర్ఎస్ గూటికి చేరినా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఒకటిగా కొనసాగుతామని సారయ్య స్పష్టం చేశారు. ఇక ఎన్నో ఏళ్ల పార్టీ అయిన కాంగ్రెస్ కు గెలుపోటములు సాధారణమని, రాష్ట్ర విభజన నుంచి ఆ పార్టీ అప్ అండ్ డౌన్ లో కొనసాగుతోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News