: జీసస్ క్రైస్ట్ అసలు పేరు కేశవ్ కృష్ణ: ‘క్రైస్ట్ పరిచయ్’ పుస్తకంలో వెల్లడి


‘జీసస్ క్రైస్ట్ అసలు పేరు కేశవ కృష్ణ.. తమిళ హిందువు.. విశ్వకర్మ బ్రాహ్మణుడుగా జన్మించాడు’ అని 1946లో రాసిన ‘క్రైస్ట్ పరిచయ్’ అనే మరాఠీ పుస్తకంలో గణేశ్ దామోదర్ (బాబారావ్) సావర్కర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన వినాయక్ దామోదర్ (వీర) సావర్కర్ కి అన్నయ్య. ముంబయికి చెందిన మతసంస్థలు ఈ పుస్తకాన్ని తిరిగి ముద్రించాయి. ఈ నెల 26న మార్కెట్ లో విడుదల చేయనున్నాయి. ఈ పుస్తకంలో క్రీస్తు గురించి ఏమి చెప్పారంటే... * జీసస్ క్రైస్ట్ మాతృభాష తమిళం * ఆయన రంగు నలుపు * పన్నెండు సంవత్సరాల వయస్సులో బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం ఆయన ఉపనయనం జరిగింది * క్రీస్తు చివరి రోజులు హిమాలయాల్లో గడిపాడు * భారత్ లోని భూభాగమే అరేబియా * యూదులు హిందువులే * అరేబియా భాష కూడా తమిళభాషకు చెందినదే... వంటి విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News