: వర్గ భేదం వీడి 'భూమా'తో కలసి పనిచేస్తాం: గంగుల ప్రభాకర్ రెడ్డి
టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియతో వర్గ భేదం వీడి కలసి పనిచేస్తామని ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొద్దిసేపటి కిందట విజయవాడలో క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలిసి పలు విషయాలపై చర్చించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, కలుపుకుని పోవాలంటే రెండు వర్గాల మధ్య ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను కమిటీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేలా చూడాలని కోరారు.