: రజనీకాంత్ కు స్వల్ప అస్వస్థత
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఒంట్లో బాగుండలేదని చెప్పడంతో రజనీని చెన్నై మణప్పాకంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిన్న రాత్రి ఆయనను డిశ్చార్జ్ చేశారు. వరుస సినిమాల కారణంగా బిజీగా ఉన్న రజనీకాంత్, విశ్రాంతి లేకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రజనీ కాంత్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఎంథిరిన్ -2, కబాలి చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.