: ‘సంపూ’ కొత్త ట్రైలర్ వదిలాడు!


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘భద్రం బీకేర్ఫుల్ బ్రదరూ..’ థియేటరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో సంపూర్ణేష్ బాబు స్టైల్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'హృదయకాలేయం' చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన సంపూర్ణేష్ బాబు.. ‘సంపూ’గా ప్రసిద్ధి చెందాడు. తనదైన శైలిలో హాస్యం పండిస్తున్న సంపూ నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం కూడా రిలీజు కావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఆయన త్రిపాత్రాభినయం చేశాడు. అయితే, 'కొబ్బరిమట్ట’ కంటే ముందుగా ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ..’ చిత్రం రిలీజు అవుతుంది.

  • Loading...

More Telugu News