: కడప పెద్ద దర్గాను సందర్శించిన ఏఆర్ రెహ్మాన్


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కడప పెద్ద దర్గాను ఈరోజు సందర్శించారు. అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో రెహ్మాన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెహ్మాన్ ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా, అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. వీటిని వీక్షించడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చారు.

  • Loading...

More Telugu News