: సల్మాన్ ఖాన్ ను హతమారుస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్స్!


బాలీవుడ్ కండల వీరుడు, హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపు కాల్స్ ఆయనకు కాకుండా నేరుగా ముంబై సిటీ పోలీసు కంట్రోల్ రూంకు వస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో వరుసగా రెండు రోజులు ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దక్షిణ ముంబై శివారు మలద్ లోని పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారు చెప్పారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని.. మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నామని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News