: మమ్మల్ని సంప్రదించకుండా జలీల్ ఖాన్ ను ఎలా చేర్చుకుంటారు?: బీజేపీ


విజయవాడ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను టీడీపీలో చేర్చుకోవడంపై మిత్రపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా ఆయనను ఎలా తీసుకుంటారని ఆ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయనను పార్టీలో చేర్చుకోవడంపై సమాధానం చెప్పాలన్నారు. ముస్లింలను అడ్డు పెట్టుకుని జలీల్ రాజకీయం చేస్తున్నారని విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. జలీల్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ టికెట్ తో తనపై పోటీ చేయాలన్నారు. ఒకవేళ జలీల్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లంపల్లి సవాల్ చేశారు.

  • Loading...

More Telugu News