: అంతా పాత చింతకాయ పచ్చడే: కాంగ్రెస్


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం చప్పగా సాగిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడిన తరువాత, కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని రాష్ట్రపతి చదివేసి వెళ్లిపోయారని, ఇందులో కొత్తగా వెల్లడించిన అంశాలేమీ లేవని అన్నారు. యూపీఏ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలనే ఎన్డీయే ప్రభుత్వం తమవిగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన వివిధ ప్రాజెక్టులు ఇప్పుడు ఉత్పత్తిని ప్రారంభించగా, అదంతా తమ ఘనతని మోదీ ప్రభుత్వం చెప్పుకుందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News