: వేధింపులకు ఎదురు తిరిగిందని యూపీలో బాలికను కాల్చేసిన దుర్మార్గులు


ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఆకతాయిల వేధింపులకు ఎదురొడ్డి నిలిచిన బాలిక తుపాకీ తూటాలకు బలైపోయింది. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆ గ్రామానికి చెందిన ఓ బాలిక, తనపై వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలకు ఎదురు తిరిగింది. అంతే, 'మాకే ఎదురుతిరుగుతావా?' అంటూ ఆ బాలికపై ఆ దుర్మార్గులు తుపాకీ ఎక్కుపెట్టారు. క్షణాల్లో తుపాకీ నుంచి దూసుకువచ్చిన బుల్లెట్లు బాలిక శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఈ కారణంగా తన చెల్లి బలైపోయిందని ఆ బాలిక సోదరి వాపోతోంది. బాలిక చనిపోయాక గాని మేల్కొనని పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News