: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగానే సీపీఎం, సీపీఐ
త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐల మధ్య పొత్తు కుదరలేదు. దాంతో విడివిడిగానే పోటీ చేయనున్నాయి. సీపీఐతో పొత్తుకు తాము ప్రయత్నించామని, కానీ వారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని సీపీఎం తెలిపింది. అందువల్ల కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని పేర్కొంది. పొత్తులపై జిల్లా కమిటీలదే తుది నిర్ణయమని మరోవైపు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలిసి పోటీకి ప్రయత్నిస్తామని చెప్పారు.