: నేపాల్ ప్రధానికి టీ పార్టీ ఇస్తున్న మనీషా కొయిరాల
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి సినీ నటి మనీషా కొయిరాలా టీ పార్టీ ఇస్తోంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం దిశగా ప్రస్తుతం ఆయన భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను పుట్టిన దేశ ప్రధాని భారత్ కు వచ్చిన సందర్భంగా ఆయన గౌరవార్ధం మనీషా రేపు పార్టీ ఏర్పాటు చేస్తోంది. అన్నట్టు మనీషా తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా 1950-60 దశకాల్లో నేపాల్లో ప్రధానిగా వ్యవహరించారు. దాంతో తన సొంత దేశ రాజకీయాలతో ఆమెకు బలమైన అనుబంధమే ఉంది. కాగా ఈ పార్టీలో బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, దర్శకుడు సుభాష్ ఘాయ్ తదితరులు పాల్గొంటారు.