: సల్మాన్ రష్దీని చంపితే 4 మిలియన్ల డాలర్ల నజరానా...ఇరాన్ మీడియా గ్రూపు ఆఫర్!

భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీపై ఇరాన్ వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. ఆయనను హత్య చేస్తే కనుక 4 మిలియిన్ల డాలర్ల నజరానా ఇస్తామంటూ తాజాగా ఇరాన్ ప్రాంతీయ మీడియా గ్రూపు ప్రకటించింది. రష్దీ రచించిన 'ద శటానిక్ వర్సెస్' ఈ ప్రకటనకు అసలు కారణం. ముస్లింలకు వ్యతిరేకంగా ఆ పుస్తకం ఉందన్న తీవ్ర ఆరోపణలతో 1989లో మొదటిసారి రష్దీపై ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా రుహోల్లా ఖొమేని ఫత్వా జారీ చేశారు. ఇందుకు ఆయన తలపై 2.7 మిలియన్ల డాలర్ల బహుమతిని ప్రకటించారు. 2012లో అది 3.3 మిలియన్ల డాలర్లకు పెరిగింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా నజరానాను పెంచడం గమనార్హం.